top of page
GPS location.jpg

మెహెరాబాదులో వసతి సౌకర్యము

మెహెరాబాదు తీర్థయాత్రకు వచ్చు ప్రేమికులకు మరియు మెహెర్ బాబా గురించి మరింత సమాచారం కోరే వారికొరకు, అవతార్ మెహెర్ బాబా ట్రస్టువారు మెహెరాబాదునందు వసతి మరియు భోజన సదుపాయము కల్పించుచున్నారు. ఇది రెండు ప్రదేశములలో కలదు.

మెహెర్ పిల్గ్రిమ్ రిట్రీట్  (MPR ) :: డబల్ బెడ్ రూమ్ మరియు నాలుగు పడకల వసతితో, 200 పడకల సౌలభ్యము కలిగిన మెహెర్ పిల్గ్రిమ్ రిట్రీట్. ఇది ఎగువ మేహేరాబాదు నందు ఉన్నది. జూన్ 15 నుండి ఏప్రిల్ 30  వరకు తెరచిఉండును.

ప్రవేశము :: ఉదయం 9 గం నుండి సాయంత్రము 6 గం వరకు.

హాస్టల్ D మరియు ఎంపీసీ (మెహెర్ పిల్గ్రిమ్ సెంటర్) దిగువ మెహెరాబాదునందు కలవు. ఇవి వసతిగృహ సదుపాయము కలిగినవి. ఇవి మే 1 నుండి మార్చ్ 15 వరకు తెరచి ఉండును.

ప్రవేశము : ఉ 6 గం. నుండి రా 10 గం వరకు.

రెండు చోట్ల, ప్రతి రోజూ మూడు భోజనాలు మరియు రెండు సార్లు టీ ఇవ్వబడును.

వీటికి ముందుగా రిజర్వేషన్ చేయవలయును.

ముందుగా రిజర్వేషన్ లేనియెడల, ప్రవేశమునకు అనుమతి ఉండదు.

ఎంపీర్ (ఎగువమెహెరాబాదు) నందు వసతి కొరకు ఇమెయిల్:

pimco@ambppct.org లేదా ఫోన్ : 0241-2548733 - విచారణకు మాత్రము.

హాస్టల్ D మరియు ఎంపీసీ లో వసతి కొరకు :

jaibaba@ambppct.org  లేదా ఫోన్ : 0241-2548777.

ఈమెయిల్కు 24 గం లో సమాధానము లభించును, లేనిచో మరొక్కసారి ఇమెయిల్ పంపవలసినది.

మరింత సమాచారం కొరకు ట్రస్ట్ వారి వెబ్ సైట్ దర్శించగలరు : https://avatarmeherbabatrust.org/accommodation

bottom of page